Monday, March 16, 2026
Homeసినిమా'హరి హర వీరమల్లు' పై హరీష్‌ శంకర్ కామెంట్స్

‘హరి హర వీరమల్లు’ పై హరీష్‌ శంకర్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రానికి విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ నటిస్తుంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం భారీ సెటప్ తో పవన్ కళ్యాణ్ మీద ఓ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారని సమాచారం.

అయితే… ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు యధావిధిగా చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ వీరమల్లు మూవీ పై ఓ ట్వీట్ చేసాడు. ఇంతకీ ఏమన్నారంటే… HHVM సెట్స్ ని సందర్శించిన హరీష్ శంకర్.. కెప్టెన్ ఆన్ జాబ్ అంటూ అక్కడ తీసిన డైరెక్టర్ క్రిష్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. కొంతకాలం తర్వాత పవన్ కళ్యాణ్ ను యాక్షన్ సెట్ లో చూడటం చాలా బాగుంది అని హరీష్ శంకర్ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనికి పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

పవన్ కళ్యాణ్ తో దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ గురించి అభిమానులు ఆరాలు తీస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై హరీష్ శంకర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular