Saturday, January 18, 2025
Homeసినిమాహ‌రీష్ శంక‌ర్ సహనానికి ప‌వ‌ర్ స్టార్ పరీక్ష?

హ‌రీష్ శంక‌ర్ సహనానికి ప‌వ‌ర్ స్టార్ పరీక్ష?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన ‘గ‌బ్బ‌ర్ సింగ్‘ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. అప్ప‌టి నుంచి ప‌వ‌న్, హ‌రీష్ కాంబోలో మరో మూవీ వ‌స్తే.. చూడాల‌ని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

వారు ఆశించినట్లే… వీరిద్ద‌రి కాంబోలో  ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ సినిమాను ప్ర‌క‌టించారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్ర‌క‌టించి రోజులు కాదు.. సంవ‌త్స‌రాలు అయిపోయింది కానీ.. ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఈ సినిమా లేదా అంటే ఉంది అంటూ అటు ప‌వ‌న్ క్లారిటీ ఇస్తుంటారు. అలాగే హ‌రీష్ శంక‌ర్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ ని కంప్లీట్ చేయ‌డానికి అక్టోబ‌ర్ నుంచి డేట్స్ ఇచ్చారు. ఆ త‌ర్వాత సుజిత్ డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. అలాగే స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్ లో కూడా సినిమా చేయ‌నున్నారు కానీ.. ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ పై మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు.  పవన్ ఏమీ  తేల్చకపోవడంతో  హ‌రీష్ మరో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో హ‌రీష్ శంక‌ర్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ ఎప్ప‌టికి సెట్స్ పైకి వ‌స్తుందో..?

Also Read: మ‌రో మూవీకి పవన్ గ్రీన్ సిగ్న‌ల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్