Friday, March 20, 2026
Homeసినిమా'ATM' వెబ్ సిరీస్ పై హరీశ్ శంకర్ మార్క్ కనిపిస్తుంది: దిల్ రాజు  

‘ATM’ వెబ్ సిరీస్ పై హరీశ్ శంకర్ మార్క్ కనిపిస్తుంది: దిల్ రాజు  

జీ 5 ఎప్పటికప్పుడు ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ లను అందిస్తూ వెళుతోంది. క్వాలిటీ విషయంలో ఎంతమాత్రం రాజీ పడకుండా యూత్ ను ఆకట్టుకుంటోంది. వైవిధ్యభరితమైన కంటెంట్ ను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ATM’ అనే వెబ్ సిరీస్ ను ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. సుబ్బరాజు .. వీజే సన్నీ .. దివి .. దివ్యవాణి .. పృథ్వీ ప్రధానమైన పాత్రలను పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి హరీశ్ శంకర్ కథను అందించాడు.

నిన్న రాత్రి జరిగిన ప్రీ లాంచ్ ఈవెంటులో దిల్ రాజు మాట్లాడుతూ .. డిస్ట్రిబ్యూటర్ గా పాతికేళ్ల అనుభవం ఉంది .. నిర్మాతగా 20 ఏళ్ల అనుభవం ఉంది. కానీ ఒక వెబ్ సిరీస్ చేయడం మాత్రం ఇదే ఫస్టు టైమ్. ఈ ప్రాజెక్టు చేద్దామని నా వరకూ తీసుకొచ్చింది .. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ చంద్రమోహన్ గురించి నాకు చెప్పింది ఆయనే. కథ మొత్తం కాకుండా .. ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ వింటూ వచ్చాను. అప్పుడే అనిపించింది ఇది ఒక మంచి ప్రయత్నం అని” అన్నారు.

” ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూడగానే .. ఒక సినిమా ట్రైలర్ చూసినట్టుగానే అనిపించింది. ఇకపై కూడా ఈ ప్రొడక్షన్ ద్వారా న్యూ టాలెంట్ ను తీసుకురావాలనేదే మా ప్రయత్నం. 20వ తేదీన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. హరీశ్ శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఒక వైపున నవ్విస్తూనే .. మరో వైపున టెన్షన్ పెడుతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular