Saturday, January 18, 2025
Homeసినిమాభ‌వ‌దీయుడు... డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్

భ‌వ‌దీయుడు… డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్

Mega leak: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ఆచార్య‌. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 29న ఆచార్య చిత్రం భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఆచార్య‌ ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు. ఇక తాజాగా ఆచార్య టీంతో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ డైరెక్ట‌ర్ హరీష్ శంకర్‌ కలిసి చేసిన ఇంటర్ వ్యూను రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కొరటాల శివ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ‌చేశారు. అయితే.. ఈ ఇంట‌ర్ వ్యూలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నుంచి ఓ డైలాగ్ ను లీక్ చేయించారు చిరంజీవి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా నుంచి డైలాగ్ ను లీక్ చేయంచ‌డం.. అది కూడా చిరంజీవి లీక్ చేయించ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఈ డైలాగ్ చిరంజీవికి బాగా న‌చ్చింద‌ట‌. అందుకే అడిగి మ‌రీ హ‌రీష్ శంక‌ర్ తో ఆ డైలాగ్ చెప్పించుకున్నారు.

ఇంత‌కీ ఆ డైలాగ్ ఏంటంటే.. ‘మొన్న వీడు మన ఇంటికి వచ్చి అరిస్తే… ఏంటి వీడి ధైర్యం అనుకున్నా. ఇప్పుడు అర్దమైంది… వీడు నడిస్తే వీడి వెనుక లక్ష మంది నడుస్తారు. ఇదే వీడి ధైర్యం అనుకుంటా’ అని విలన్ అనగా, పక్కనే ఉన్న మరో వ్యక్తి  “కాదు… ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అనే ధైర్యం అని చెప్తాడు అంటూ చిరు రిక్వెస్ట్ మేరకు హరీష్ శంకర్ డైలాగ్ ను లీక్ చేసేశారు. ఈ డైలాగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Also Read : మ‌రో ఐదు క‌థ‌ల‌కు చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్