Saturday, March 14, 2026
Homeసినిమాహరీష్‌ శంకర్ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

హరీష్‌ శంకర్ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్.. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో వీరిద్దరు కలిసి మరో సినిమా చేస్తే చూడాలి అనుకున్నారు అభిమానులు. అనుకున్నట్టుగానే ఈ క్రేజీ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మూవీని ప్రకటించి రోజులు నెలలు కాదు.. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ.. సినిమా మత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు.

పవన్ కళ్యాణ్‌ మరో వైపు పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. ‘హరి హర వీరమల్లు‘ సినిమాకి డేట్స్ ఇచ్చారు కానీ.. ‘భవదీయుడు భగత్ సింగ్’ కి డేట్స్ ఇంకా ఇవ్వలేదని.. ఇక ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ లేదని టాక్ వినిపించింది. దీంతో హరీష్ శంకర్ కూడా రామ్, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్ ఇలా వేరే హీరోలను ట్రయ్ చేస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో మైత్రీతో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, పూజ కూడా చేసుకోమని చెప్పేసారని తెలిసింది. సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ లో నిలిచింది.

అయితే.. పవన్ తో హరీష్‌ చేసేది భవదీయుడు భగత్ సింగ్ మూవీ కాదని… ‘తెరి’ సినిమా రీమేక్ తన విజన్ లో ఎలా వుంటుందో హరీష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మేరకు పవన్ సరే స్క్రిప్ట్ చేయమని చెప్పినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఎప్పుడు సినిమా చేస్తారో? ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా వుంటారో ఆయనకే తెలియని పరిస్థితి. ఇటువంటి టైమ్ లో హరీష్ శంకర్ పవన్ తో సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో..? ఎప్పుడు పూర్తి చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular