Thursday, March 12, 2026
Homeసినిమామళ్లీ రవితేజనే లైన్లో పెట్టిన హరీశ్ శంకర్!

మళ్లీ రవితేజనే లైన్లో పెట్టిన హరీశ్ శంకర్!

ఒకప్పుడు ఒక హీరోతో ఒక ప్రాజెక్టు అనుకుని ఆ ప్రాజెక్టు కోసమే ఎంత సమయమైనా దర్శకులు వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరో వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉంటే, అది అయ్యేంతవరకూ దర్శకులు ఎదురుచూస్తూ కూర్చోవడం లేదు. ఆ లోగా దర్శకులు మరో ప్రాజెక్టుతో మరో హీరోతో ముందుకు వెళుతున్నారు. కానీ హరీశ్ శంకర్ మాత్రం పవన్ కల్యాణ్ సినిమానే చేయాలనే ఉద్దేశంతో చాలా కాలంగా వెయిట్ చేస్తూ రావడం ఆశ్చర్యం.

భారీ హిట్స్ ఉన్నప్పటికీ హరీశ్ కి గ్యాప్ వచ్చేసింది. 2019లో వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ ఆయన చివరి సినిమా. ఆ సినిమా ఆయనకి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెట్టింది. ఆ వెంటనే ఆయన పవన్ కల్యాణ్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. కానీ ప్రాజెక్టు మాత్రం ముందుకు కదల్లేదు. పవన్ ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. కాస్త ఆలస్యంగా తేరుకున్న హరీశ్, మరో ప్రాజెక్టును హరీశ్ సెట్ చేసుకున్నాడు.

తన కెరియర్ తొలినాళ్లలో తనకి ఛాన్స్ ఇచ్చిందీ .. లైఫ్ ఇచ్చింది రవితేజ అని చాలా వేదికలపై  హరీశ్ చెప్పాడు. అలాగే హరీశ్ ఎంచుకునే కథలు తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఉంటాయనే సంగతి రవితేజకి కూడా తెలుసు. అందువల్లనే ‘మిరపకాయ్’ తరువాత మరోసారి ఈ కాంబో పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హీరోయిన్ ను సెట్ చేసే పనిలో ఉన్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజ .. చాలా గ్యాప్ తీసుకున్న హరీశ్ శంకర్ కలిసి ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular