Sunday, January 19, 2025
HomeTrending Newsహరితనిధికి విరాళాలు... ఉత్తర్వులు జారీ

హరితనిధికి విరాళాలు… ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిధులతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విరాళాలు ఇచ్చే విధంగా హరితనిధికి విరాళాల పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు ఏడాదికి 6000రూపాయలు విరాళం ఇవ్వాలని జెడ్పీ ఛైర్ పర్సన్లు, కార్పోరేషన్ల ఛైర్మన్లు ఏడాదికి 1200 విరాళం అందచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఏడాదికి 600 విరాళం, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు 120 విరాళం, సర్పంచులు ఏడాదికి 120 రూపాయలు విరాళం, ఇంజనీరింగ్ కాంట్రాక్టుల నుంచి 0.01శాతం విరాళం, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 10శాతం విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. వీతితోపారు స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ ఒక్కో రిజిస్ట్రేషన్ కు 50 రూపాయలు విరాళం, వాణిజ్య సముదాయాల ఒక్కో అనుమతికి వెయ్యి రూపాయలు విరాళం, బార్లు, మద్యం దుకాణాల ఒక్కో అనుమతికి వెయ్యి రూపాయలు విరాళం ఇవ్వాలని పేర్కొన్నారు.

విద్యార్థులను కూడా వదలని ప్రభుత్వం పదోతరగతి వరకు విద్యార్థులు పది రూపాయల విరాళం, ఇంటర్ విద్యార్థుల విరాళం 15 రూపాయలు, డిగ్రీ విద్యార్థుల విరాళం 25 రూపాయలు, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల విరాళం 100 రూపాయలు కోర్సు అడ్మిషన్ సమయంలో ఫీజులతో పాటు వాసులు చేస్తారు.

హరితనిధికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా విరాళాలు ఇచ్చేలా తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా ఏప్రిల్ నెల వేతనం నుంచి హరితనిధికి ప్రభుత్వ ఉద్యోగుల విరాళం, అఖిల భారత సర్వీసు అధికారులు సహా అన్ని రకాల ఉద్యోగుల నుంచి విరాళాలు, ఏడాదికి అఖిల భారత సర్వీసు అధికారుల విరాళం 1200 రూపాయలు, ఏడాదికి ఇతర ఉద్యోగుల విరాళం 300 రూపాయలు, మేలో చెల్లించే ఏప్రిల్ వేతనంలో ఈ మేరకు విరాళం మొత్తం హరితనిధికి జమ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్