Saturday, January 18, 2025
Homeసినిమా'ఆహా' లోకి 'హరోం హర'.. ఎప్పుడంటే..?

‘ఆహా’ లోకి ‘హరోం హర’.. ఎప్పుడంటే..?

మొదటి నుంచి కూడా సుధీర్ బాబు తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. కంటెంట్ డిఫరెంట్ గా ఉంటేనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో గ్యాప్ వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాంటి ఒక కొత్త కంటెంట్ తో ఆయన చేసిన సినిమానే ‘హరోం హర’. జూన్ 14వ తేదీనే థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ ద్వారా పలకరించనుంది.

 సుధీర్ బాబు జోడీగా మాల్విక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సునీల్ .. జయప్రకాశ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సుమంత్ నాయుడు నిర్మించిన ఈ సినిమాకి, జ్ఞానసాగర్ దర్శకత్వం వహించాడు. థియేటర్ల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా వదిలారు.
కథలోకి వెళితే .. కథానాయకుడు సుబ్రమణ్యం కాస్త పద్ధతిగా పెరిగిన కుర్రాడు. ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకోవడం కోసం ‘కుప్పం’లో అడుగుపెడతాడు. అలాంటి సుబ్రమణ్యం ఒక మాఫియాతో చేతులు కలుపుతాడు. అంతేకాదు అక్కడ లోకల్ గా ఉన్న విలన్ తో పెట్టుకుంటాడు. అప్పుడు ఏమౌతుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్