Saturday, January 18, 2025
HomeTrending NewsParliament: అత్యవసర సమావేశాలు ఎందుకు? - వినోద్ కుమార్

Parliament: అత్యవసర సమావేశాలు ఎందుకు? – వినోద్ కుమార్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. మోడీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. సమావేశాల పేరుతో ప్రజలను గందరగోలంలో పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నట్టుండి సమావేశాలు ఎందుకుపెడుతున్నారని చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి హనుమకొండలోని భద్రకాళి అమ్మవారిని ఈ రోజు వినోద్‌ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 2001లో టీఆర్ఎస్ ప్రారంభం రోజున గులాబీ జెండా అమ్మవారి వద్దకు తీసుకువచ్చామని తెలిపారు. అమ్మవారి ఆలయంలో పూజ చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఒక సెంటిమెంటుగా వస్తుందన్నారు.

అభివృద్ధిపరంగా దేశంలో తెలంగాణ మొదటి వరుసలో ఉందని చెప్పారు. సంక్షేమ పథకాల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వ్యవసాయంతోపాటు పరిశ్రమల ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామీణ ప్రాంత ప్రజలను ఆర్థికంగా ఎదిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా మంచి విజయం సాధించి కేంద్రంతో కొట్లాడి మనకు రావాల్సినవి సాదించుకుందామని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్