Saturday, November 23, 2024
HomeTrending Newsఢిల్లీ చేరుకున్న కెసిఆర్

ఢిల్లీ చేరుకున్న కెసిఆర్

డిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ నిర్మాణ కోసం శంఖుస్తాపన చేసేందుకు హైదరాబాద్ నుంచి సతీ సమేతంగా బయలుదేరిన సిఎం కేసిఆర్ ..ప్రత్యేక విమానంలో సాయంత్రానికి డిల్లీకి చేరుకున్నారు. వీరి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపి సంతోష్ కుమార్ వున్నారు. ఈ సందర్భంగా డిల్లీ ఎయిర్ పోర్టులో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు సురేష్ రెడ్డి, బీబి పాటిల్, వెంకటేష్ నేత, బండప్రకాష్, ఎమ్మేల్యేలు క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజ్ తదితరులు ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు.
అప్పటికే డిల్లీకి చేరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ శంఖుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సిఎం రాక సందర్భంగా డిల్లీలో టిఆర్ఎస్ భవన్ శంఖుస్థాపన సందర్భంగా ఢిల్లీ పురవీధులు గులాబి మయమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సిలు, రాష్ట్ర స్థాయి నాయకత్వం అప్పటికే డిల్లీకి చేరుకోవడంతో తెలంగాణ భవన్ పరిసర భవనాలన్నీ టీఆర్ఎస్ నేతలతో కోలాహాలంగా మారాయి. శంఖుస్థాపన కార్యక్రమానికి ఢిల్లీ కి వచ్చిన టిఆర్ఎస్ శ్రేణులకు లోకసభలో టీఆర్ఎస్ పార్లమెంట్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆతిథ్యం ఇచ్చారు. నామా ఏర్పాటు చేసిన ఆతిథ్యానికి సిఎం కేసిఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకుస్థాపన ఏర్పాట్ల గురించి మంత్రి కేటిఆర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిల్లికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ ముఖ్య నేతలను పేరు పేరున పలకరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్