Saturday, January 18, 2025
HomeTrending Newsత్వరలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్: కేటియార్

త్వరలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్: కేటియార్

రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటియార్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నేడు మంత్రుల బృందం వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ నేడు మంత్రుల బృందం వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటియార్ మత్లాడుతూ ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే, వారికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుందని కేటియార్ అన్నారు.

వైద్య ఆరోగ్య రంగంలో వ్యాధుల ట్రెండ్స్, వాటి నివారణ, ఇతర కార్యక్రమాల తయారీలో ఈ ప్రాజెక్టు సహకారం అందిస్తుందని అయన అభిప్రాయపడ్డారు.  ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్య సహకారం అందించేందుకు ఈ ప్రాజెక్టు సమాచారం దోహద పడుతుందన్నారు.  మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్