అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) గ్రీన్ బిల్డింగ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. CII చైర్మన్ సమీర్ గోయల్ తో కలసి యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలియజేశారు.
నిత్యజీవితంలో యోగ ప్రాముఖ్యతను వివరించారు. మన దేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని అభివర్ణించారు. యోగా ను అందరూ ఆచరించి తమ ఆరోగ్యం ను పెంపొందించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా CII ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో CII టూరిజం వింగ్ కన్వీనర్ ఆనందిత , జయ భారతి, యోగ గురువు హర్షిత, CII సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.