Sunday, January 19, 2025
Homeసినిమాసంక్రాంతి సినిమాల బడ్జెట్ ఎంత?

సంక్రాంతి సినిమాల బడ్జెట్ ఎంత?

సంక్రాంతి వస్తుంది అంటే.. సినిమాల పండగ వస్తున్నట్టే. దీంతో ఫిల్మ్ మేకర్స్ సంక్రాంతికి భారీగా సినిమాలు రిలీజ్ చేసేందుకు పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి కూడా భారీ చిత్రాలు పోటీపడుతున్నాయి. నాలుగు భారీ చిత్రాలతో పాటు ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలు ఏంటి… వాటి బడ్జెట్ ఎంత అనేది చూస్తే… ముందుగా చెప్పాల్సింది. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య గురించి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడదుల చేయనున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి దాదాపు 140 కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారం.

ఇక సంక్రాంతికి వస్తున్న మరో సినిమా నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. ఇందులో కూడా బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మించింది. ఈ మూవీకి బడ్జెట్ 110 కోట్లు అయినట్టు తెలిసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

ఈ రెండు భారీ చిత్రాలతో పాటు వస్తున్న మరో భారీ చిత్రం వారసుడు. ఇది కోలీవుడ్ స్టార్ విజయ్ తో టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ లో రూపొందుతోన్న ఈ సినిమాకి బడ్జెట్ ఏకంగా 250 కోట్లు అయినట్టు సమాచారం. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

ఇక అజిత్ నటించిన తునివు సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది. ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు. మొత్తం నాలుగు సినిమాలు కూడా వంద కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం జరిగాయి. సంక్రాంతికి వస్తున్న ఈ నాలుగు భారీ చిత్రాల్లో రెండు స్ట్రైయిట్ తెలుగు సినిమాలు అయితే.. రెండు డబ్బింగ్ సినిమాలు. మరి… ఈ సంక్రాంతి వార్ లో విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి

Also Read : సంక్రాంతి పోటీలో విజేత‌గా నిలిచేదెవ‌రు..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్