Heavy Cannabis Seizure In Hyderabad :
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసు. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నది. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి నుంచి మూడు కార్లను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు.
Also read : గంజాయిపై ఉక్కుపాదం మోపాలి – కెసిఆర్