Monday, March 16, 2026
HomeసినిమాRama Banam: 'రామబాణం' అందరికీ నచ్చుతుంది - గోపీచంద్

Rama Banam: ‘రామబాణం’ అందరికీ నచ్చుతుంది – గోపీచంద్

గోపీచంద్, శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా పై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ… ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిభొట్ల గారికి కృతజ్ఞతలు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చి సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. శ్రీవాస్ గారితో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చేశాను. మూడో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాం. అప్పుడు భూపతి రాజా గారి దగ్గర వున్న కథ విన్నప్పుడు చాలా నచ్చింది. మధు, అబ్బూరి రవి గారు కూడా ఈ కథకు చాలా హెల్ప్ చేశారు. డింపుల్ చాలా చక్కగా నటించింది. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. మిక్కీ జే మేయర్ తో చేయడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5న రామబాణం విడుదలౌతుంది. అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular