మనుషులకు, మొక్కలకు మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అని వర్ధమాన హీరో అశోక్ గల్లా అన్నారు. ఆయన నటించిన ‘హీరో’ సినిమా విడుదలవుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్, జీహెచ్ఎంసి పార్క్ లో కథానాయిక నిధి అగర్వాల్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో కలిసి మొక్కలు నాటారు.
మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రకృతి సమతూల్యత దెబ్బతినడం వల్ల ఇప్పటికే ఈ భూమిపై అనేక విపత్తులు సంభవిస్తున్నాయని. అది ఆగాలంటే మొక్కలునాటడం ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. అందు కోసం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లాంటి కార్యక్రమాన్ని రూపొందించి, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. వారి కృషి మరింత ముందుకు సాగాలంటే విధిగా మనమంతా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగం కావాలి. విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ పాల్గొని వృక్ష వేదం పుస్తకాన్ని సినిమా బృందానికి అందించారు.