Saturday, January 18, 2025
Homeసినిమాపట్టాలెక్కనున్న నాని 'హిట్ 3'

పట్టాలెక్కనున్న నాని ‘హిట్ 3’

హీరోగా నాని ఫుల్ బిజీ. ఆయన ప్లానింగును .. కథల ఎంపికను ఇండస్ట్రీలో అంతా మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘సరిపోదా శనివారం’ రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు తరువాత నాని చేయనున్న సినిమా ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ‘హిట్ 3’ గురించిన మాట వినిపిస్తోంది. హీరోగా నాని వరుస సినిమాలు చేస్తూనే, అడపాదడపా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  అలా ఆయన నిర్మాణంలో విష్వక్సేన్ హీరోగా వచ్చిన ‘హిట్’ మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’ కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ‘హిట్ 3’ కూడా ఉంటుందనే హింట్ అప్పుడే ఇచ్చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు.

ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుందనేది తాజా సమాచారం. ‘హిట్ 2’ చేసిన శైలేశ్ కొలను ‘హిట్ 3’ కూడా చేయనున్నాడు. ఈ మధ్య ఆయన తెరకెక్కించిన ‘సైన్ధవ్’ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో ‘హిట్ 3’ ఆయన దర్శకత్వంలో ఉండొకపోవచ్చని అనుకున్నారు. కానీ శైలేశ్ దర్శకత్వంలోనే నాని ఈ సినిమాను ముందుకు తీసుకుని వెళ్లనున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా, మొదటి రెండు భాగాలను మించిన వసూళ్లను రాబడుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్