Saturday, January 18, 2025
Homeసినిమా‘అద్భుతం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన నాని

‘అద్భుతం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన నాని

‘ఓ బేబి; సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించి మంచి మార్కులు కొట్టేసిన తేజ సజ్జా… ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు. దీంతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎస్.ఎస్. రాజు దర్శకత్వంలో తేజ నటించిన  ‘ఇష్క్-నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను-మాన్ అనే సినిమా కూడా ప్రారంభమైంది.

అలానే మల్లిక్ రామ్ డైరెక్షన్ లో ఓ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాడు తేజ. ఇందులో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘అద్భుతం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. తేజ – శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఇది ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా అని తెలుస్తోంది. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించగా.. లక్ష్మీ భూపాల్ స్క్రీన్ ప్లే – మాటలు రాస్తున్నారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిజినల్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. చంద్ర శేఖర్ మొగుల్ల – సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ అద్బుతం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్