Monday, March 9, 2026
Homeసినిమావియత్నాంలో నిఖిల్ ఏం చేస్తున్నాడో?

వియత్నాంలో నిఖిల్ ఏం చేస్తున్నాడో?

హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఛాలెంజింగ్ పాత్రలను పోషించడానికి ఇష్టపడతారు. కార్తికేయ 2 సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘స్పై’ కాస్త నిరాశపరిచింది. తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ‘ కోసం నిఖిల్ కఠోర శిక్షణను తీసుకుంటున్నాడు. యుద్ధం నేపధ్యంలో  సాగే ఈ సినిమాలో ఒక యోధునిగా కనిపించడానికి  నెల రోజుల పాటు కఠినమైన శిక్షణ కోసం వియత్నాం వెళ్లాడు. ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్. సైగాన్‌లోని కొంత మంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌లు, టీమ్స్..  యూనిట్లో భాగంగా వుండి, స్వయంభూ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్ కి శిక్షణ ఇస్తారు.

అలాగే నిఖిల్ ఫిజికల్ మేకోవర్ కూడా అవుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో ఒక లెజెండరీ యోధుడిగా కనిపించారు. ఇప్పటి వరకు నిఖిల్‌కి ఇది చాలా ఛాలెంజింగ్ రోల్. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  నిఖిల్‌కు ఇది మైల్ స్టోన్ 20 వ చిత్రం మరియు తన కెరీర్ లో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మూవీ. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘స్వయంభూ’ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular