Saturday, January 18, 2025
Homeసినిమా'చోర్ బజార్'’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన రామ్

‘చోర్ బజార్’’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన రామ్

Chor song: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకం పై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ ను ఈరోజు స్టైలిష్ హీరో రామ్ పోతినేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ… చోర్ బజార్ టైటిల్ సాంగ్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా ట్రెండీగా ఉండి, గల్లీ బాయ్స్ పాటలా అనిపించింది. ఆకాష్ క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్ అదిరిపోయినట్లు పాటతో తెలుస్తోంది. రెగ్యులర్ పాటలా కాకుండా ర్యాప్ తో టూడేస్ సాంగ్ లా చేశారు. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఆకాష్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నాను. ఇలాగే ట్రెండ్ సెట్టర్స్ గా సినిమాలు చేస్తూ ఉండాలని విష్ చేస్తున్నాను అన్నారు.

చోర్ బజార్ టైటిల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే… “మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె.. దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె.. ఇది చోర్ బజార్…ఆజా చోర్ బజార్..ప్రతి బస్తీలో ఉంటనేను లేదు నాకు ఆధార్.. నచ్చినట్లు బతుకుతుంట లేదు నాకు బాధ… ఖద్దరైన, ఖాకీ అయిన లేదు నాకు తేడా, రంగు రంగు జీవితాలు చోర్ బజార్ ఆజా…” అంటూ సాగుతుందీ గీత. రాప్ స్టైల్ లో సాగిన ఈ పాట మంచి ఎనర్జీతో సాగుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను వివరించింది. నవాబ్ గండ్, అసురన్ టీమ్ ఈ పాటకు సంగీతాన్ని, ర్యాప్ అందించి పాడారు. “చోర్ బజార్” సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్