Saturday, January 18, 2025
Homeసినిమాశ్రీరంగాపూర్ లో ఒక్కటైన సిద్ధార్థ్ - అదితిరావు

శ్రీరంగాపూర్ లో ఒక్కటైన సిద్ధార్థ్ – అదితిరావు

హీరో సిద్ధార్థ్.. నటి అదితిరావు హైదరీని వివాహమాడారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ మండపంలో నేడు వీరి పెళ్లి జరిగింది.  కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కాగా సిద్ధార్ద్ కు ఇది రెండో వివాహం. గతంలో మేఘన అనే తన చిన్ననాటి స్నేహితురాలిని 2003లో సిద్దార్థ్ వివాహమాడారు. మూడేళ్ళ కాపురం తరువాత 2006లో వీరు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది వీరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

అదితిరావు హైదరాబాద్ లో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకోగా, తల్లి పెంపకంలో ఉన్నారు. ఆమె విద్యాభ్యాసం  మదనపల్లి రిషి వ్యాలీ స్కూల్ లోనే సాగింది. 2002లో బాలీవుడ్ నటుడు, లాయర్ సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచారు. కానీ 2012లో వీరు విడాకులు తీసుకున్నారు.

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో  దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన  ‘మహా సముద్రం’ సినిమాలో అతిథి రావు హైదరి కూఒడా నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్