Saturday, January 18, 2025
Homeసినిమాథియేటర్ లోనే ‘లైగర్’: విజయ్ దేవరకొండ

థియేటర్ లోనే ‘లైగర్’: విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందని.. ఓ ప్రముఖ సంస్థ భారీగా 200 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని వార్తలు వచ్చాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది నిజమేనా..? లైగర్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందా.? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఈ వార్తలను హీరో విజయ్ దేవరకొండ ఖండించారు. 200 కోట్ల చాలా తక్కువ.. మా మూవీ థియేటర్లో అంత కంటే ఎక్కువే వసూలు చేస్తుందని చెప్పారు.

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. లాక్ డౌన్ ఎత్తేయడంతో త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముంబాయిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించాల్సివుంది. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ మూవీని పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరి.. ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 9నే వస్తుందా లేదా అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్