Thursday, March 19, 2026
Homeసినిమాజగన్, పవన్ లపై విశాల్ కామెంట్స్....

జగన్, పవన్ లపై విశాల్ కామెంట్స్….

కోలీవుడ్ స్టార్ విశాల్.. తెలుగులో ‘ప్రేమ చదరంగం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. పందెం కోడి, పొగరు, భరణి, భయ్యా, పిస్తా.. ఇలా విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుని అటు తమిళ్, ఇటు తెలుగులో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. లేటెస్ట్ గా విశాల్ నటించిన మూవీ లాఠీ. ఇందులో విశాల్ నిజాయితీ గల కానిస్టేబుల్ క్యారెక్టర్ లో నటించాడు. వినోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో లాఠీ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ కోసం విశాల్ డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాల్ గత చిత్రాల వలే లాఠీ కూడా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగాంగా మీడియాతో మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే… విశాల్ వ్యాఖ్యలు అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యాయి.

ఇంతకీ పవన్, జగన్ గురించి విశాల్ ఏమని కామెంట్ చేశారంటే…. తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని, యూనిక్ స్టైల్ పవన్ సొంతం అని అన్నారు. థియేటర్ల లో పవన్ కళ్యాణ్ సినిమాలు చూశానని, పండుగలా ఉంటాయని చెప్పుకొచ్చారు. అదే విధంగా రాజకీయాల విషయానికి వస్తే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టమని తెలిపారు. ఓటేసే అవకాశం వస్తే.. ఇక్కడ తన ఓటు జగన్ కి వేస్తా అని తెలిపారు విశాల్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏపీ రాజకీయాల్లోకి వస్తాడని.. కుప్పం నుంచి పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది కానీ.. ఏపీ రాజకీయాల్లోకి రానని చెప్పేశాడు విశాల్. మొత్తానికి వార్తల్లో నిలిచాడు. మరి.. లాఠీతో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular