Saturday, March 14, 2026
Homeసినిమాడిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చే మూవీ 'మార్క్ ఆంటోని' - విశాల్

డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చే మూవీ ‘మార్క్ ఆంటోని’ – విశాల్

విశాల్ నటిస్తున్న చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈరోజు ఆగష్టు 29 ఆయన పుట్టినరోజు. ఈ సందర్బంగా మార్క్ ఆంటోని సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా వివరించారు. ”ఈ బర్త్ డే తనకెంతో స్పెషల్ అని..  ఎందుకంటే  సెప్టెంబర్ 15న ‘మార్క్ ఆంటోని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను అని విశాల్ చెప్పారు. ఇప్పటి వరకు నేనేన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాల్లో నటించానని… ఆడియెన్స్ ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. వారు అందించిన ఆదరాభిమానాలతోనే ఈ స్థాయికి వచ్చాను. నాపై ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రేకకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పారు.

‘మార్క్ ఆంటోని’ విషయానికి వస్తే..  కెరీర్లో ఇదెంతో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్ మూవీ. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే.. ఇదొక ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాను. ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓ కీలకమైన పాత్రలో ఎస్.జె.సూర్య నటించారు. జి.వి.ప్రకాష్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. జి.వి. మ్యూజిక్ తో పాటు అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ.. పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ ఫైట్స్ హైలైట్ గా నిలుస్తాయన్నారు. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఆడియెన్స్ కి ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ను మార్క్ ఆంటోని మూవీ ఇస్తుంది. మీ ప్రేమ, అభిమానాలుంటే ఇలాంటి సినిమాలను ఇంకా మరెన్నింటినో చేసి మిమ్మల్ని మరింతగా అలరిస్తాను అన్నారు విశాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular