Saturday, January 18, 2025
Homeసినిమా‘ఎంగేజ్ మెంట్’ రద్దు చేసుకున్న మెహ్రీన్

‘ఎంగేజ్ మెంట్’ రద్దు చేసుకున్న మెహ్రీన్

‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక మెహ్రీన్. తొలి సినిమాతోనే సక్సస్ సాధించిన మెహ్రీన్ ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘జవాన్’, ‘పంతం’, ‘ఎఫ్-2’ చిత్రాల్లో నటించింది. అయితే.. కెరీర్ స్పీడు అందుకుంటుందనుకున్న టైమ్ లో హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ కు వివాహం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సర మార్చి నెలలో వీరిద్దరికి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఈపాటికే మ్యారేజ్ జరగాల్సింది అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

మ్యారేజ్ పోస్ట్ పోన్ కావడం వలన వచ్చిన సినిమా అవకాశాలకు ఓకే చెప్పింది. సంతోష్ శోభన్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమాతో పాటు ‘ఎఫ్-2’ సీక్వెల్ ‘ఎఫ్-3’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఏమైందో ఏమో కానీ తాను, బిష్ణోయ్ విడిపోతున్నట్లు మెహ్రీన్ ట్విట్టర్ లో ప్రకటించడం షాకింగ్ గా మారింది. బిష్ణోయ్ తో జరిగిన నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు తెలియచేసింది. తామిద్దరం పెళ్లి చేసుకోవడం లేదని కూడా తేల్చేసింది. ఈ నిర్ణయం ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నట్లు మెహ్రీర్ ప్రకటించింది.

ఇక పై బిష్ణోయ్ తో కానీ, అతడి కుటంబ సభ్యులు, స్నేహితులతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండదని మెహ్రీర్ ప్రకటించడం సంచలనంగా మారింది. నా మనసుకు నచ్చినట్లుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెహ్రీన్ తెలియచేసింది. ఈ వ్యవహారం గురించి తాను చెప్పాలనుకుంటున్నది ఇదే అని మెహ్రీన్ పేర్కొంది. తన నిర్ణయాన్ని, వ్యక్తిగత విషయాలని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇక నుంచి తాను ఇంతకు ముందు వలే సినిమాల్లో నటిస్తూ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మెహ్రీన్ తెలియచేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్