Saturday, September 21, 2024
HomeTrending NewsTS Highcourt: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు

TS Highcourt: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని స్పష్టంచేసింది. దీంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్ ను ప్రకటించింది. ఎన్నికలవేళ తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినట్లు నిర్దారించిన.. ధర్మాసనం రూ.5లక్షలు జరిమానా విధించింది. అయితే, ఎన్నికలప్పుడు అఫిడవిట్‌లో సమర్పించిన కేసులు, ఆస్తులు అబద్దాలని తేల్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వనమా..ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన జలగం వెంకట్రావు.. వనమా అఫిడవిట్‌పై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. తీర్పునిచ్చింది.

వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేకు అనర్హుడని.. 2018 నుంచి సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అని తెలంగాణ ధర్మాసనం తెలిపింది. కాగా.. వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా.. బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్