Friday, October 18, 2024
Homeతెలంగాణజిఓ 1014పై స్టే కు హైకోర్ట్ నో

జిఓ 1014పై స్టే కు హైకోర్ట్ నో

దేవరయంజాల్ దేవాలయ భూములపై ప్రభుత్వం జారీ చేసిన జి ఓ 1014 అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆలయ భూములు గుర్తించేందుకు విచారణ కమిటీ నియమిస్తే మీకు ఎందుకు ఇబ్బంది అంటూ పిటిషనర్ ను ప్రశ్నించింది. ప్రభుత్వ, ఆలయ భూములు గుర్తించకూడదా, కబ్జాదారులు ఆక్రమణలు చేసుకుంటుంటే ఏమీ అనకూడదా అంటూ అంటూ నిలదీసింది. విచారణ చేసి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని, వారిని ఆ పని చేసుకోనివాలని ఆదేశించింది. దేవరయంజాల్ భూముల సర్వే పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వస్తున్నారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకురాగా, భూముల్లోకి వెళ్ళే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కమిటీ కి కావాల్సిన సమాచారం, పత్రాలు అందించాలని పిటిషనర్ ను ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ దేవరయంజాల్ దేవాలయ భూములను ఆక్రమించుకున్నారని వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది, దీనిపై విచారణ చేసేందుకు ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ వేసింది. సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక ఇవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీ ఏర్పాటును సవాల్ చేస్తూ ఈటెల హైకోర్టును ఆశ్రయించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్