Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఆనందయ్య మందుపై విచారణ 3 గం.కు వాయిదా

ఆనందయ్య మందుపై విచారణ 3 గం.కు వాయిదా

ఆనందయ్య మందుపై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మందు పంపిణీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ మందుపై ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతున్నారని. మందు వాడకంపై దుష్పరిణామాలు అధ్యయనం చేసున్నామని ప్రభుత్వ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటించనందుకు ఆనందయ్య పై ఎఫ్ ఐ ఆర్ నమోదైందని చెప్పారు.

మందు పంపిణీ లుపుదలకు సంబంధించిన ఆర్డర్స్ కోర్టుకు ఎందుకు సమర్పించలేదని, వివరాలు కావాలని అడుగుతుంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నరంటూ కోర్టు ప్రశ్నించింది.

ఈ మందుతో బ్లాక్ ఫంగస్ వస్తుందన్న అనుమానం ఉందని. దీనిపై అధ్యయనం జరిపిస్తున్నామని చెప్పారు. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వ లాయర్ పై ఆనందయ్య తరపు లాయర్ అశ్వినీకుమార్ అభ్యంతరం తెలిపారు. ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కేంద్రానికి మాత్రమే ఉందని పిటిషనర్ తరపు లాయర్ బాలాజీ కోర్టుకు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీకి వ్యతిరేకం కాదని తగిన అనుమతుల కోసం చూస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. సిఎం వద్ద సమావేశం కాగానే తగిన పత్రాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్