Cv Anand : హైదరాబాద్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కమిషనర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్రోపాలిటన్ సిటీ లో శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనవని, ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉంటున్నారన్నారు.
సైబరాబాద్ సీపీ గా కొనసాగినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల మీద సమీక్ష పెట్టారని, మహిళల భద్రత మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని సివి ఆనంద్ గుర్తుచేశారు. 2001 నుండి సెంట్రల్ జోన్ డిసిపి గా పనిచేశానని, అడిషనల్ సిపి ట్రాఫిక్ గా పనిచేశానని వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని, సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిషనర్ భరోసా ఇచ్చ్హారు. డ్రగ్స్ పై ఇప్పటికే వేచారాన్కొ నసాగుతుందని, ఇంకా డ్రగ్స్ పై అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
మరోవైపు ఏసిబి డిజి గా అంజని కుమార్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అవినీతి, అక్రమాల కట్టడికి ముఖ్యమంత్రి కెసిఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, సిఎం ఆశయాలకు అనుగుణంగా అవినీతి నియంత్రిస్తామని అంజని కుమార్ చెప్పారు.
Also Read : ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు