Tuesday, March 10, 2026
HomeTrending NewsAP Assembly: తీవ్ర ఉద్రిక్తత - సభ వాయిదా

AP Assembly: తీవ్ర ఉద్రిక్తత – సభ వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం  ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే జీవో నంబర్ 1పై చర్చకు తెలుగుదేశం పట్టుబట్టింది. ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్న ఈ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానం చేపట్టాలంటూ స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. కొందరు టిడిపి సభ్యులు పేపర్లు చించి స్పీకర్ పైకి విసిరేశారు. స్పీకర్ తో టిడిపి సభ్యులు వాగ్వాదానికి దిగారు, అధికార పక్ష సభ్యులు కూడా తెలుగుదేశం సభ్యులను అడ్డుకునేందుకు పోడియంవైపు దూసుకు వచ్చారు. ఈ సమయంలో సభలో ఉద్రిక్తత నెలకొంది. సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకు వెళ్ళారు… దీనితో సభకు కాసేపు విరామం ప్రకటించారు.

Also Read : బడ్జెట్ పై నిరసన – టిడిపి సభ్యుల సస్పెన్షన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular