Saturday, January 18, 2025
Homeసినిమాహాలీవుడ్ మూవీలో ఎన్టీఆర్, చరణ్‌?

హాలీవుడ్ మూవీలో ఎన్టీఆర్, చరణ్‌?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌  కలిసి నటించిన  ఆర్ఆర్ఆర్ బాలీవుడ్  తో పాటు హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది.  ఇటీవలే ఆ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు గోల్డన్ గ్లోబ్ అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. చరణ్‌, ఎన్టీఆర్ కూడా ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో వారిద్దరూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసిన హంగామా పలు హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది.  వీరిద్దరికీ వేర్వేరు హాలీవుడ్ సంస్థల్లో ఆఫర్లు ఇప్పించడానికి  ఓ ఏజెన్సీ గట్టిగానే ట్రై చేస్తోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రామ్ చరణ్, ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ల ఆఫర్లని దక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది.  పైగా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డ్ కూడా ఈ సినిమాకు ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.

చరణ్‌ తాజాగా శంకర్ తో మూవీ చేస్తున్నారు.  దీని తర్వాత బుచ్చిబాబుతో సినిమా ఉంటుంది.  తాను ఆరు సినిమాలకు ఓకే చెప్పానని  చరణ్ వెల్లడించాడు. ఇక తారక్.. కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు బడా ఫిల్మ్ మేకర్స్ లైన్ లో ఉన్నారు.

మరి.. చరణ్‌, తారక్ లతో హాలీవుడ్ మేకర్స్ మూవీ ప్లాన్ చేస్తున్నారనే వార్తల్లో వున్న నిజమెంత?.. నిజంగానే హాలీవుడ్ సంస్థలు మన హీరోల కోసం ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా వున్నాయా? అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read : ‘నాటు నాటు’ కు గోల్డెన్ గ్లోబ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్