అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీని డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తో చేశారు. అది కూడా సోషియో ఫాంటసీ మూవీ చేశారు. డెబ్యూ మూవీకి సోషియో ఫాంటసీ మూవీని ఎంచుకోవం విశేషం. అయితే.. ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు చేసిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు భారీ పాన్ ఇండియా మూవీ ఏజెంట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
క్లైమాక్స్ కోసమే ఎక్కువ టైం తీసుకుంటున్న దర్శకుడు సురేందర్ రెడ్డి దాన్ని రెండు వెర్షన్లుగా తీస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఫైనల్ గా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఏది బెటర్ అనిపిస్తే దానికి ఫిక్స్ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారట. ఈ లెక్కన ఏప్రిల్ లో రిలీజ్ కావడం కూడా అనుమానమే అంటున్నారు సినీ జనాలు. ఇదిలా ఉంటే.. ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఎవరితో అంటే.. శాండల్ వుడ్ నుంచి కెజిఎఫ్, కాంతార లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో సత్తా చాటిన హోంబాలే ఫిలింస్ సంస్థ అఖిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ప్రాధమికంగా చర్చలు జరిగాయని, దర్శకుడిని ఫైనల్ చేశాక ప్రకటిస్తారని సమాచారం. రాబోయే రోజుల్లో మూడు వేల కోట్లతో సినిమాలు ప్లాన్ చేసుకున్న ఈ బ్యానర్ లో అఖిల్ సినిమా చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ రేంజ్ ని ఆశించవచ్చు. అయితే డైరెక్టర్ ఎవరన్నది కీలకం. అగ్ర దర్శకులందరూ బిజీగా ఉన్నారు. దీంతో ఎవరు డైరెక్టర్ అనేది ఆసక్తిగా మారింది.