Honourable Vice President Of India To Tour In Andhra Pradesh For one Week :
రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిజిపి గౌతమ్ సావాంగ్, జిల్లా కలెక్టర్ జే. నివాస్ తదితరులు ఉపరాష్ట్రపతి కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారం రోజులపాటు రాష్ట్రంలో వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అయన విజయవాడ, గన్నవరం, విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
ఉపరాష్ట్రపతి పాల్గొనే ముఖ్య కార్యక్రమాలు:
అక్టోబర్ 30:
సా. 4గం.ల నుండి 5.30 గం.ల వరకూ రైతు నేస్తం వార్షిక అవార్డులు-2021
అక్టోబర్ 31:
ఉ.8.30గం.లకు సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జన్మదినోత్సవ వేడుకలు
ఉ.9.15 గం.లకు విజయవాడ కృష్ణ లంకలోని రామ్ మోహన్ లైబ్రరీని సందర్శన
10.30.గం.లకు ఎయిమ్స్ డైరెక్టర్ ఇచ్చే ప్రజెంటేషన్ ను తిలకిస్తారు
నవంబరు 1:
ఉ.9.55 గం.లకు చిన్న అవుట్ పల్లిలోని డా. పిన్నమనేని సిద్ధార్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ లో ఎల్పియం పిఎస్ఏ ప్లాంట్ ప్రారంభోత్సవం
సా.4గం.లకు ఐఐపిఏ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో వర్చువల్ గా ప్రసంగం
నవంబరు 2:
ఉ.8.15 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విశాఖపట్నం
ఉ.10.25 గం.లకు సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరు
సా.4గం.లకు 61వ జాతీయ డిఫెన్స్ కళాశాల(ఎన్డిసి) కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొంటారు
నవంబరు 3,4:
పోర్ట్ ట్రస్ట్ అతిథి గృహంలో బస
నవంబరు 5:
ఉ.10 గం.ల నుండి 11గం.ల వరకూ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
సా.4.25 గం.లకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని డా. వైవియస్ మూర్తి ఆడిటోరియంలో విశాఖ సాహితీ సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు
నవంబరు 6:
సా.4.20 గం.లకు విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో పాట్నా పయనం
ఉపరాష్ట్రపతి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు
Must Read :విద్యారంగంలో మార్పులు రావాలి – ఉపరాష్ట్రపతి