Sunday, January 19, 2025
HomeUncategorizedహైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అంబులెన్సులు అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినా సరిహద్దుల్లో ఇంకా అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో పోలీసులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మాజీ ఐ ఆర్ ఎస్ అధికారి రామకృష్ణా రావు పిటిషన్ దాఖలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను ఐదు రోజులుగా ఏపి సరిహద్దుల్లో తెలంగాణా పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రి నుంచి బెడ్ కేటాయించినట్లు ధ్రువ పత్రం ఉంటేనే అనుమతిస్తామని చెబుతున్నారు. అంబులెన్సులు అడ్డుకోవడం దారుణమని, అలా చేయవద్దని తెలంగాణా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విజయవాడ నుంచి వచ్చే వాహనాలను జగ్గయ్యపేట వద్ద, కర్నూల్ నుంచి వచ్చే వాహనాలను పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఆపుతున్నారు. రోడ్ల పైనే గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి కర్నూల్ కు చెందిన ఇద్దరు పేషెంట్లు మరణించారు. కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలంగాణా బోర్డర్ వద్దకు చేరుకొని చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్