Thursday, March 12, 2026
Homeసినిమాఆనంద్ దేవరకొండకి 'బేబి' హెల్ప్ చేసేనా?

ఆనంద్ దేవరకొండకి ‘బేబి’ హెల్ప్ చేసేనా?

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తన ప్రత్యేకతను చాటుకోవడానికీ .. తన టాలెంట్ తో ఎదగడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ‘దొరసాని’ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఆనంద్, అప్పటి నుంచి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూనే వెళుతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూనే, అవి హిట్ తెచ్చి పెడతాయనే నమ్మకంతో వెయిట్ చేస్తూనే ఉన్నాడు.

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ..  ‘పుష్పక విమానం’ వంటి సినిమాలు చేశాడుగానీ, వాటిని ఆడియన్స్ ఎంతమాత్రం పట్టించుకోలేదు. తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా కాస్త ఇన్నోసెంట్ పాత్రలనే ఎంచుకుంటున్నాడు. కథ ఏదైనా కాస్త కామెడీ టచ్ ఉండేలా చూసుకుంటున్నాడు. కానీ ఫలితం మాత్రం మారడం లేదు. అయినా నిరాశపడిపోకుండా కుర్ర హీరోలతో కలిసి రేసులో పరిగెడుతూనే ఉన్నాడు. అలాంటి ఆనంద్ ఈ సారి టీనేజ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

ఆనంద్ తాజా చిత్రంగా రూపొందిన ‘బేబి’ ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ..  స్కూల్ డేస్ లో నడిచే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్కూల్ డేస్ లోకి వెళతారంటూ దర్శకుడు సాయి రాజేశ్ చెప్పిన దగ్గర నుంచి ఈ సినిమాపై యూత్ లో ఆసక్తి పెరిగింది. పైగా ఈ వారం థియేటర్లకు వస్తున్న తెలుగు సినిమా ఇదొక్కటే. మంచి బజ్ తో థియేటర్స్ కి వెళుతున్న ఈ సినిమా, ఆనంద్ దేవరకొండ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular