Saturday, November 23, 2024
HomeTrending NewsYSRCP Bus Yatra: ముసుగు దొంగలు మళ్లీ వస్తున్నారు...జాగ్రత్త: బొత్స

YSRCP Bus Yatra: ముసుగు దొంగలు మళ్లీ వస్తున్నారు…జాగ్రత్త: బొత్స

సామాజిక సాధికారతను వైసీపీ సాధించిందో లేదో  చెప్పడానికి శృంగవరపుకోట సభకు నేడు వచ్చిన జనమే నిదర్శనమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వెనుకబడిన వర్గాలకు సామాజిక, రాజకీయ సాధికారత ఇచ్చి చూపిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో కిక్కిరిసిపోయిన జనసందోహం,  జై జగన్ నినాదాల హోరు మధ్య దిగ్విజయంగా సాగింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కంబాబ జోగులు, శంబంగి చిన అప్పలనాయుడు, కుంభారవి బాబు, అలజంగి జోగారావు, జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతి రాణి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జి వై వీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అలమండలో జగనన్న కాలనీ సందర్శనలో భాగంగా లబ్ధిదారుడు నిర్మించుకున్న గృహాన్ని మంత్రి బొత్స ప్రారంభించి స్థానికంగా ఉన్న సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవి గుడి జంక్షన్ లో జరిగిన బహిరంగసభలో నేతలు ప్రసంగించారు.

ఎన్నికల్లో ఏం చెప్పామో.. పాలనలో ఏమి చేశామో ప్రజలకు చెప్పడానికే మీ ముందుకు వస్తున్నామని బొత్స వివరించారు. ఎన్నికల్లో ఇష్టానుసారం హామీలుఇచ్చేసి ప్రజల నుంచి పారిపోయే పరిస్థితి మాకు లేదని అన్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ముసుగులు తీసి టీడీపీ, జనసేన దొంగలు వస్తున్నారన్నారని విమర్శించారు. ముసుగులు వేసుకుని మళ్లీ మోసం చేయాడనికి వస్తే ఊరుకుంటారా.. అని ప్రజల్ని ప్రశ్నించారు. చంద్రబాబు వస్తే దోపిడీలు, మధ్యవర్తులు, లంచగొండులు మళ్లీ వస్తారని  హెచ్చరించారు. పారిశ్రామికవాడకు కేబినెట్ లో జగన్ ఆమోదం తెలిపారని, అది అమల్లోకి వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీి ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఉందని. రాబోయే ఎన్నికలు క్యాష్ వార్ అని బొత్స అభివర్ణించారు.

అనాదిగా నిరాదరణకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను సీఎం వైయస్‌ జగన్‌ అక్కున చేర్చుకున్నారని వైఎస్సార్సీపీ  నేతలు కొనియాడారు. సామాజిక సాధికారత దిశగా అడుగులు వేయించి రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేశారని చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర 7వ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జు, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ముస్తఫా, హఫీజ్‌ ఖాన్, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏడో రోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగింది. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన మేలుతో పాటు, చేనేతలకు ప్రత్యేకంగా అందిన లబ్ధి కూడా యాత్రలో చర్చగా మారింది. సామాజిక సాధికార యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగకు వేలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. సభ అసాంతం వక్తల ప్రసంగాలు శ్రద్దగా వినడమే కాకుండా…జై జగన్‌ అంటూ పదేపదే నినదించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ సభలో డిప్యూటీ సిఎం అంజాద్ భాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రులు శంకర నారాయణ, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపి బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్