Tuesday, February 25, 2025
HomeTrending Newsగుత్తిలో జగన్ యాత్రకు అపూర్వ స్వాగతం

గుత్తిలో జగన్ యాత్రకు అపూర్వ స్వాగతం

వైయస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు అనంతపురం జిల్లా అపూర్వ స్వాగతం పలికింది వైయస్సార్ కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల యాత్ర అనంతరం గుత్తి పట్టణంలోకి జగన్ అడుగు పెట్టారు. సుమారు 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు జన ప్రభంజనం కదిలి వచ్చింది.

పత్తికొండ శివార్లలోని స్టే పాయింట్‌ నుంచి ఇవాళ ఉదయం మొదలైన ముఖ్యమంత్రి బస్సుయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరధం పట్టారు.  దీంతో షెడ్యూల్‌ కన్నా ఆలస్యంగా బస్సు యాత్ర నడిచింది.
మధ్యాహ్న భోజన విరామ సమయం లేకుండానే బస్సుయాత్ర కొనసాగింది.

గుత్తి పట్టణంలోకి అడుగుపెట్టగానే చరిత్రలో నిలిచి పోయేలా అశేష అభిమానగణం స్వాగతాన్ని అందించింది. స్థానిక రైల్వే బ్రిడ్జి నుంచి హైవే వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర దాదాపు రెండు గంటలపాటు బస్సు యాత్ర కొనసాగింది. గుత్తి చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా జగన్ బస్సుయాత్ర సాగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్