Monday, March 9, 2026
Homeతెలంగాణకౌశిక్ రెడ్డికి  షోకాజ్ నోటీస్

కౌశిక్ రెడ్డికి  షోకాజ్ నోటీస్

హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి షో కాజ్ నోటీస్ జారీ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ సంఘం. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు అందాయని క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. గతంలోనే క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా కౌశిక్ రెడ్డి వైఖరిలో మార్పులేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్న క్రమశిక్షణ సంఘం. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular