Saturday, January 18, 2025
HomeTrending Newsడ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్

డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్

జీవితాలను కబళించే మహమ్మారి డ్రగ్స్ కు యువత, విద్యార్ధులు బానిసలు కావద్దు.. జీవితాన్ని అంధకారమయం చేసుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బాలం రాయ్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో కంటోన్మెంట్ MLA సాయన్న, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నార్త్ జోన్ డిసిపి చందనా దీప్తి, సినిమా డైరెక్టర్ కొరటాల శివ, సీనియర్ నటులు శ్రీనివాస్ రెడ్డి, సినీ రచయితా తనికెళ్ళ భరణి, ప్రముఖ గాయకులు శ్రీ రామచంద్ర, రాహుల్ సిప్లిగంజ్, నైనా జైస్వాల్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలత, మహేశ్వరి, నార్త్ జోన్ పరిధిలోని ACP లు, CI లు, SI లతో పాటు విద్యార్ధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలన పై రాహుల్ సిబ్లి గంజ్ పాట విద్యార్ధులలో ఎంతో జోష్ నింపింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్ములనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి పేద, ధనిక, యువత, విద్యార్ధి అనే తేడాలు లేకుండా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. చాలా మంది తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని అన్నారు. ఒక్కసారి డ్రగ్స్ కు బానిసలు అయితే చావే శరణ్యం అనే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. డ్రగ్స్ ఉపయోగించడం వలన ఆరోగ్యపరంగా నష్టపోవడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడుతాయని, తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలని తుడిచేసి వారి క్షోభకు కారకులు కావద్దని కోరారు.

తప్పు చేసి జైలు కు వెళ్లడం…ఆ తర్వాత మదనపడటం ఎందుకు? అసలు తప్పే చేయకుండా ఉంటే బావుంటుందనే విషయాన్ని యువత, విద్యార్ధులు ఆలోచించాలని చెప్పారు. డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్దాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో ఉన్న డ్రగ్స్ వినియోగం, మాఫియాను నిర్మూలించడానికి సామాజిక బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీసే డ్రగ్స్ ను ప్రతి ఒక్కరం నిర్ములిద్దామని డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ను మార్చుకుందామని మంత్రి చెప్పారు. తెలంగాణ పోలీసు శాఖ ఎంతో సమర్దవంతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. చాలా నేరాలలో నేరస్తులను క్షణాల్లో పట్టుకొని చట్టం ముందు నిలబెట్టే సత్తా తెలంగాణ పోలీసులకే ఉందన్నారు. కార్పోరేట్ ఆఫీలకు ధీటుగా పోలీస్ స్టేషన్ లను, కార్యాలయాల తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు.

Also Read : భాగ్యవంతుల బాధ

RELATED ARTICLES

Most Popular

న్యూస్