సిఎం జగన్ ఇప్పటివరకూ ఫ్యాక్షనిస్టులతోనే గొడవ పెట్టుకున్నారని కానీ తన లాంటి ఒక విప్లవకారుడితో ఇంతవరకూ ఆయన గొడవపెట్టుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ పిండివంటకు-పిండాకూడుకు; తద్దినానికి-అట్లతద్దికి; శ్రాద్ధానికి-శ్రావణ శుక్రవారానికి; అ కి – ఆ కి; వారాహికి- వరాహికి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. నేడు దెందులూరు నియోజక వర్గ ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలతో పవన్ భేటీ అయ్యారు.
వాలంటీర్ల పొట్ట కొట్టాలన్నది తన ఉద్దేశం కాదని, తాను ఏం చెబుతున్నానో ఓసారి వినాలని విజ్ఞప్తి చేశారు. సేకరించిన డేటా ఎక్కడ పెడుతున్నారు, ఎవరికి పంపుతున్నారు, అది ఎక్కడ నిక్షిప్తమవుతోంది, అది వైసీపీ ఆఫీసులో ఉందా, జగన్ ఇంట్లో ఉందా, ఒకవేళ మీ ఫోన్ మిస్ అయితేనో, హ్యాక్ అయితేనో ఈ డేటా కు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కేవలం ఐదు వేల రూపాయలు మీకు వస్తే తాను మరో ఐదు వేలు అదనంగా ఇచ్చే వ్యక్తినని చెప్పారు. రాక్షలు గతంలో వేదాల జ్ఞానాన్ని తస్కరించేవారన్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారం ప్రభుత్వం తప్ప ప్రైవేట్ వ్యక్తులు చూసే అవకాశం లేదని పేర్కొన్నారు.
వాలంటీర్లపై తాను మాట్లాడగానే ఏదో అయిపోయినట్లు అందరూ ప్రశ్నిస్తున్నారని, వారు ఐదారు లలక్షల మంది, వారు జగన్ సైన్యం అని అంటున్నారని,. అయితే తన సైన్యానికి వారు చిటికిన వేలుతో కూడా సమానం కాదని, కానీ వారు అందరూ వచ్చినా తాను ఒక్కడినే వస్తానని స్పష్టం చేశారు.
తానేదో ఆషామాషీగా చేసిన వ్యాఖ్యలు కాదని, కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకే మాట్లాడానని చెప్పారు. తాను పోరాట యాత్ర చేసినప్పుడు, జన వాణి సమయంలో ఎందరో తనకు ఈ విషయాలు చెప్పారని పవన్ వివరించారు.