Saturday, January 18, 2025
Homeసినిమాకొత్త టాలెంటును ఎంకరేజ్ చేయడంలో ముందుంటాం: మెగాస్టార్

కొత్త టాలెంటును ఎంకరేజ్ చేయడంలో ముందుంటాం: మెగాస్టార్

చిరంజీవి – మెహర్ రమేశ్ కాంబినేషన్లో రూపొందిన ‘భోళాశంకర్’ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదలవుతోంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ స్టేజ్ పై చిరంజీవి మాట్లాడుతూ .. మెహర్ రమేశ్ తనకి చాలా కాలంగా తెలుసనీ, అతనితో ఉన్న పరిచయం కారణంగా ఈ సినిమా చేయలేదనీ, ఒక మంచి కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే చేశానని అన్నారు. తాను ఏ సినిమా చేస్తున్నా, తన అభిమానులను దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో తన కెరియర్ చాలా చిన్న రోల్స్ తోనే మొదలైందనీ .. ప్రేక్షకుల అభిమానం కారణంగానే తాను అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చానని చెప్పారు. తనని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి కొత్త హీరోలు .. దర్శకులు రావడం తనకి చాలా ఆనందాన్ని కలిగించే విషయమని అన్నారు. ఇండస్ట్రీకి కొత్త టాలెంటు రావాలనీ, కొత్త టాలెంటును మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుందని అన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మిగతా హీరోలంతా కష్టపడి ముందుకు వెళుతున్నవారేనని చెప్పారు.

ఈ సినిమా రీమేక్ కదా అంటూ కొన్ని కామెంట్లు వినిపించాయనీ, కథ బాగున్నప్పుడు .. ఆ కథలో ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పుడు రీమేక్ చేయడంలో తప్పులేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘భోళా శంకర్’ లో తాను చాలా హ్యాండ్సమ్ గా కనిపించాననీ .. ఎనర్జిటిక్ గా కనిపించానని అంటుంటే తనకి చాలా సంతోషంగా ఉందనీ, అందుకు కారణం తన అభిమానులేనని  బలంగా చెప్పగలనని అన్నారు. ఈ సినిమా వాళ్ల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్