Sunday, January 19, 2025
HomeTrending Newsఇళ్ళ నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్ధం: జోగి

ఇళ్ళ నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్ధం: జోగి

రాష్ట్ర వ్యాప్తంగా 30.65 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు  గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్లలో స్కాం జరిగిందంటూ ప్రధానికి లేఖ రాయటం సరికాదని, అసలు జ ఏ ఆధారాలతో నసేన అధ్యక్షుడు లేఖ రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్‌ రాసిన లేఖపై జోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ప్రస్తావించిన  13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు.

30.65 లక్షల పేదింటి అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని, వారికి పట్టాలు ఇవ్వటంతో పాటు ఇప్పటికే వారిలో 21.75 లక్షల గృహాల నిర్మాణం కూడా మొదలు పెట్టారని  వెల్లడించారు. వీటిలో ఇప్పటికే కొన్ని ఇళ్ళలో  అక్కచెల్లెమ్మలు గృహ ప్రవేశాలు చేసుకుని జయహో జగనన్న అని నినదిస్తున్నారని అన్నారు.

“గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, బీజేపీ కలిసే పోటీ చేశారు. ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించాడా? రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచాడు. ఆ పాపంలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా?” అని రమేష్ ప్రశ్నించారు.

“పవన్‌ కల్యాణ్‌ లేఖలో ప్రతి అంశం మీద చర్చించటానికి సిద్ధంగా ఉన్నాను. చర్చకు పవన్‌ కల్యాణ్‌ రావాలి. ఎక్కడైనా ఒక్క రూపాయి తేడా ఉందో చూపించండి. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రానికి రావటం హోటల్‌లో పడుకోవటం. ఒక గంట కార్యకర్తలతో మాట్లాడి.. 23 గంటలు పడుకోవటం పవన్ కల్యాణ్‌ చేస్తున్నారు. కాకినాడ చుట్టుప్రక్కల అభివృద్ధి ఎలా జరుగుతుందో వెళ్లి చూడు పవన్‌ కల్యాణ్‌. నేడు 17వేలకు పై చిలుకు జగనన్న కాలనీలు కడుతున్నాం” అంటూ పవన్ కు సమాధానం ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్