Wednesday, March 18, 2026
Homeసినిమా'గుంటూరు కారం' ఈవెంటులో మెరిసిన శ్రీలీల!

‘గుంటూరు కారం’ ఈవెంటులో మెరిసిన శ్రీలీల!

మహేశ్ బాబు – శ్రీలీల కాంబినేషన్లో త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమాను రూపొందించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీలేన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిన్న రాత్రి గుంటూరులో నిర్వహించారు. ఈ సినిమాకి సంబంధించిన కథ గుంటూరు నేపథ్యంలో జరుగుతుంది. అందువలన ప్రీ రిలీజ్ ఈవెంటును  గుంటూరులో ప్లాన్ చేశారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సాధారణంగా ఇలా ఓపెన్ ఏరియాలో ఈవెంట్స్ పెట్టినప్పుడు రావడానికి హీరోయిన్స్ పెద్దగా ఇష్టపడరు. ఏదో ఒక కారణం చెప్పేసి తప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంత క్రౌడ్ చూసి వాళ్లు కంగారు పడుతూ ఉంటారు. అయితే శ్రీలీల మాత్రం ఈ సినిమా ఫంక్షన్ కి వచ్చింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో తళుక్కుమని మెరిసింది. రాఘవవేంద్రరావు గారి తరువాత త్రివిక్రమ్ గారు తనని రీ లాంచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది.

త్రివిక్రమ్ గారి మాటల్లోనూ .. కథల్లోను ఆయనకి గల నాలెడ్జ్ తెలిసిపోతూ ఉంటుందనీ, అలాంటి ఆయన దర్శకత్వంలో ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తూ ఉంటానని చెప్పింది. ఇక మహేశ్ బాబు గారి విషయానికి వస్తే, ఆయనను చూస్తూ తాను డైలాగ్స్ మరిచిపోయేదానినని అంది. ఫస్టు డే షూటింగు పూర్తిచేసుకుని రాగానే, మహేశ్ బాబుగారి గురించి తనని ఇంట్లో వాళ్లు అడిగారనీ, బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటారో అలా ఉంటారని చెప్పానంటూ, ఆయన అభిమానుల నుంచి మరిన్ని మార్కులు కొట్టేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular