Saturday, January 18, 2025
Homeసినిమానాన్నగారు ఎదురుగా ఉంటే ఎవరికీ సౌండ్ రాదు: మంచు విష్ణు 

నాన్నగారు ఎదురుగా ఉంటే ఎవరికీ సౌండ్ రాదు: మంచు విష్ణు 

మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘జిన్నా’ సినిమా ఈ నెల 21వ తేదీన థియేటర్లకు రానుంది. విష్ణు సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి రెండో సినిమానే. కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన ‘గోలీ సోడా’ .. ‘జారు మిఠాయి’ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాయల్ – సన్నీ లియోన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, నిన్న రాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.

ఈ వేదికపై మంచు విష్ణు మాట్లాడుతూ .. “నాన్నగారు స్టేజ్ పై ఉండగా నేను మాట్లాడలేను. ఆయన ఎదురుగా ఉంటే ఎవరికీ సౌండ్ రాదు. ఒక్క కోపం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోను ఆయన నాకు స్ఫూర్తి. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు నా కెరియర్లోనే ది బెస్ట్ గా భావిస్తున్నాను” అన్నారు. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ .. “విష్ణు ఈ సినిమా కోసం చాలా రిస్కీ షాట్లు చేశాడు. ఇకపై అలాంటి పనులు చేయవద్దనే నేను చెబుతున్నాను. భగవంతుడి ఆశీస్సుల వలన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఇక కోన వెంకట్ మాట్లాడుతూ .. “ఈ సినిమా బాధ్యతను మోహన్ బాబు నా భుజాలపై పెట్టారు. దాంతో మొదటి నుంచి చివరి వరకూ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోవలసి వచ్చింది.  ఈ సినిమా కోసం మోహన్ బాబు గారు అన్ని అస్త్రాలను వాడేశారు. విష్ణుకి ఈ సినిమా హిట్ చాలా అవసరం. అందరూ కూడా ఈ సినిమాను ఆదరించి మంచు ఫ్యామిలీకి ఒక మంచి హిట్ ఇస్తారని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక చోటా కె నాయుడు మాట్లాడుతూ .. “విష్ణు హీరోగా నేను చేసిన మొదటి సినిమా ఇది. తనకి సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా వలన నాకు మోహన్ బాబు ఫ్యామిలీ అనే ఒక ఆస్తి దొరికింది” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Also Read : విష్ణు మంచు ‘జిన్నా’ ట్రైలర్ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్