Saturday, January 18, 2025
Homeసినిమానేను ఇంతవరకూ ఇలాంటి సినిమా చేయలేదు: గోపీచంద్ 

నేను ఇంతవరకూ ఇలాంటి సినిమా చేయలేదు: గోపీచంద్ 

గోపీచంద్ కి యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు కూడా ఆయనకి  బాగానే ఉంది. కథ ఏదైనా అందులో గోపీచంద్ మార్క్ మాస్ యాక్షన్ ఉంటుంది. ఆయన సినిమాల నుంచి ఆడియన్స్ అది తప్పనిసరిగా ఆశిస్తారు. అందువలన ఆయన కూడా తన సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలు ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. అలా ఆయన చేసిన మరో యాక్షన్ థ్రిల్లర్ ‘భీమా’.

గోపీచంద్ హీరోగా కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి, కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించాడు. ప్రియా భవాని శంకర్ – మాళవిక శర్మ కథానాయికలుగా కనిపించనున్నారు.  ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలనగానే జీప్ తోనే .. బుల్లెట్ పైనో కనిపిస్తూ ఉంటారు. కానీ ఎద్దుపై కూర్చుని ఉన్న హీరో లుక్ తో మేకర్స్ ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. అప్పటి నుంచి ఈ సినిమా నుంచి వదులుతున్న అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి.

ఈ సినిమాలో యాక్షన్ ఉంది .. ఆ యాక్షన్ కి ఫాంటసీ టచ్ ఉంది. ఈ సినిమాలోని ప్రత్యేకత ఇదేనని తాజా ఇంటర్వ్యూలో గోపీచంద్ చెప్పాడు. ఇంతవరకూ ఇలా ఫాంటసీ టచ్ ఉన్న సినిమా తాను చేయలేదనీ, ఈ సినిమాలో ఈ కోణం హైలైట్ గా నిలుస్తుందని అన్నాడు. మహాశివుడికి సంబంధించిన అంశంతో ఈ కథ మొదలవుతుందనీ .. అలాగే ఆయనకి సంబంధించిన విశేషంతోనే ముగుస్తుందనీ చెప్పాడు. అలా మహాశివరాత్రి ఆడియన్స్ కి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది” అని అన్నాడు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్