Sunday, March 8, 2026
Homeసినిమా'ఉప్పెన'కి నేను తీసుకున్నది చాలా తక్కువే: విజయ్ సేతుపతి

‘ఉప్పెన’కి నేను తీసుకున్నది చాలా తక్కువే: విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి .. కోలీవుడ్ లో ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. విలక్షణ నటుడిగా అక్కడ ఆయనకి మంచి పేరు ఉంది. అలాగే మాస్ హీరోగా బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు కూడా ఉన్నాయి. సాధారణంగా ఒక భాషలో హీరోగా చేసేవారు, అదే భాషలో విలన్ వేషాలు వేయడానికి భయపడతారు. తమ ఇమేజ్ .. మార్కెట్ పడిపోతాయని కంగారు పడుతుంటారు. కానీ విజయ్ సేతుపతి అందుకు భిన్నంగా కనిపిస్తాడు.

కోలీవుడ్ లో విలన్ గా మెప్పించిన ఆయన, ఇతర భాషల్లోను స్టార్ విలన్ గా ముందుకు వెళుతున్నాడు. బాలీవుడ్ హీరోలు సైతం విలన్ పాత్రలకు ఆయన పేరును సూచిస్తున్నారంటే, ఆయన క్రేజ్ ఎంతవరకూ వెళ్లిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే క్రమంలో ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం చేరువయ్యాడు. తాను మాత్రమే చేయగలడు అనుకున్న పాత్రలు చేయడానికి రంగంలోకి దిగుతూ వచ్చాడు. అలా ఆయన తెలుగులో చేసిన ‘ఉప్పెన’ సినిమాను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు.

‘ఉప్పెన’ సినిమాకి విజయ్ సేతుపతి రోజుకి 50 లక్షలు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలా ఆయన ఆ సినిమాకి 12 కోట్లు పారితోషికంగా అందుకున్నాడనే టాక్ వచ్చింది. అయితే తన తాజా చిత్రం ‘మహారాజ’ సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. తాను ఎంత తీసుకున్నదీ చెప్పలేదుగానీ, తాను తీసుకునే దానికంటే చాలా తక్కువ పారితోషికం తీసుకున్నానని అన్నాడు. అందుకు కారణం డైరెక్టర్ తనకి కథ చెప్పిన తీరు నచ్చడం వల్లనేనని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular