Sunday, January 19, 2025
Homeసినిమా‘అఖండ’ విష‌యంలో నా న‌మ్మ‌కం నిజ‌మైంది : నిర్మాత రవీందర్ రెడ్డి

‘అఖండ’ విష‌యంలో నా న‌మ్మ‌కం నిజ‌మైంది : నిర్మాత రవీందర్ రెడ్డి

I wish to do sequel for Akhanda: ‘జయ జానకీ నాయక’ సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే అభిరుచిగ‌ల నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి. ఈ ఏడాది న‌టిసింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ‘అఖండ’ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించి అగ్ర నిర్మాత‌గా ఎదిగారు. ఈరోజు (డిసెంబ‌రు 29) తన పుట్టిన‌రోజు సందర్భంగా మిర్యాల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే….

పెద్ద డైరెక్టర్, రేర్ కాంబినేషన్ అనే నమ్మకంతోనే అఖండ‌ సినిమా చేశాను. ఒకప్పుడు ఒక్క డైరెక్టరే పది సినిమాలు చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ దర్శకుడు ఒక సినిమాను చేయడమే కష్టం. స్టార్ హీరోలకు పది ప్లాఫులు వచ్చినా కూడా ఒక్క హిట్ వస్తే.. సెట్ అవుతుంది. స్టార్ హీరోకున్న అడ్వాంటేజ్ అదే. నేను అదే నమ్ముతా. బోయపాటి గారు మొదటి సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అన్నీ చెప్పారు. అఖండ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని నాకు ముందే తెలుసు. ఈ విషయాన్ని చెబితే న‌మ్మ‌రేమో కానీ నాకు మాత్రం మొదటి నుంచి నమ్మకం ఉంది.

Akhanda Team

స్టార్ హీరోలతోనే అని కాదు అందరితోనూ సినిమాలు చేస్తాను. కథలు కుదిరితే అందరితో చేస్తాను. అఖండ సినిమా విషయంలో దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. మా సినిమా విడుదల విషయంలో ప్రభుత్వం కొంత సపోర్ట్ చేసింది. త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నాం. బోయపాటి గారి రాబోయే సినిమాల్లో నేను భాగస్వామిని అవుతానా? లేదా? నేను చెప్పలేను. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే కోరిక నాక్కూడా ఉంది.

ఒక వేళ హిందీలో రీమేక్ చేయాలనుకుంటే.. ఇలాంటి పాత్రలకు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు అయితే బాగుంటుంది. వచ్చే ఏడాది మార్చిలో ఓ సినిమాను ప్రారంభిస్తాను. అందులో ఓ కొత్త హీరోను పరిచయం చేయబోతోన్నాను. ఒక పెద్ద సినిమా కూడా చర్చల దశల్లో ఉంది. ఇంకా కన్ఫామ్ కాలేదు. రాజకీయాల పై నాకు ఆసక్తి ఉంది కానీ.. ఇప్పుడు అయితే నేను ఏ పాలిటిక్స్‌ లో లేను. అడ్వాన్స్‌ లు ఇచ్చి బుక్ చేసుకోవడం నాకు తెలీదు. ఎవరైనా కథ చెబితే.. నచ్చితే.. దానికి తగ్గట్టు హీరోలకు వినిపించడమే అలవాటు. మున్ముందు నాకు కూడా అలా అడ్వాన్స్‌ లు ఇచ్చేది అలవాటు అవుతుందేమో చూడాలి.. అంటూ చెప్పుకొచ్చారు.

Also Read : ‘అఖండ’ 25 రోజుల వేడుక

RELATED ARTICLES

Most Popular

న్యూస్