తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపి కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని… గాంధి గారికి, నెట్టెం రఘురాం లాంటి మంచి వాళ్ళకూ పోటీ చేసే హక్కు ఉందని…. అదే విధంగా దావూద్ ఇబ్రహీం, ఛార్లెస్ శోభారాజ్ లాంటి వాళ్లకు, భూకబ్జాదారులకు, స్త్రీ లోలులకు కూడా సీట్లు ఇవ్వొచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఎన్టీఆర్ ఓ గొప్ప ఆశయంతో పెట్టిన పార్టీ అని, ఈ పార్టీ సిద్దాంతాలు ఏమిటో అలోచించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై కూడా నాని తనదైన శైలిలో స్పందించారు. పార్టీ అవసరం మేరకు తనను ఎక్కడైనా వాడుకోవచ్చని, తాను ఢిల్లీ స్థాయి నాయకుడినని అన్నారు. ఎంపి కావడం వల్లే తాను ఈ స్థాయికి రాలేదని, తనకో బ్రాండ్ ఉందని అన్నారు. అవినీతి చేయడం కోసం తానూ రాజకీయాల్లోకి రాలేదన్నారు.
తన సోదరుడు చిన్నికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చిన్నితో పాటు మరో ముగ్గిరికి టికెట్ ఇచ్చినా తన సహకారం ఉండబోదన్నారు. మోసాలు చేసేవాళ్ళు, పేకాట క్లబ్ లు నడిపెవారికి తానూ మద్దతు ఇవ్వబోనన్నారు. ఒక పేదవాడికి సీటు ఇస్తే తాను వెంట ఉండి గెలిపిస్తానని హామీ ఇచ్చారు.