Saturday, January 18, 2025
HomeTrending Newsకృష్ణపట్నం రానున్న ఐసీఎంఆర్‌ బృందం

కృష్ణపట్నం రానున్న ఐసీఎంఆర్‌ బృందం

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో పర్యటిస్తుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. ఈ బృందం ఆయుర్వేద మందు శాస్త్రీయతను పరీక్షించిన తర్వాతే తిరిగి పంపిణీ జరిగే అవకాశం ఉంది.

కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై అనుమానాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్ శుక్రవారం అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని అధికారులకు సూచించారు. అధ్యయనం కోసం ఐసీఎంఆర్ బృందాన్ని కృష్ణపట్నం పంపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ఈ సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లి అక్కడ బస చేసి రేపు కృష్ణపట్నం లో ఆయుర్వేద మందును పరిశీలిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్