Sunday, March 15, 2026
HomeసినిమాAllu Arjun: వైరలైన ఇన్స్టాగ్రామ్ తో ఐకాన్ స్టార్ వీడియో

Allu Arjun: వైరలైన ఇన్స్టాగ్రామ్ తో ఐకాన్ స్టార్ వీడియో

జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రాంతీయ సరిహద్దులను దాటి దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించారు. గంగోత్రి నుండి పుష్ప వరకు తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ‘పుష్ప: ది’ రైజ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా గుర్తింపును అందుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అల్లు అర్జున్ తో ఇన్‌స్టాగ్రామ్‌ చేసిన ఓ స్పెషల్ వీడియో అదుర్స్ అనిపించేలా ఉంది. ఒక రోజంతా ఇన్‌స్టాగ్రామ్ టీమ్ ఈ ఐకాన్ స్టార్ తోనే ఉంది. ఫస్ట్ టైం అమెరికాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ టీం స్వయంగా హైదరాబాద్ వచ్చి ఓ రోజంతా అల్లు అర్జున్ గారితో గడపడం విశేషం.

ఈ వీడియోలు బన్నీ దినచర్యను వీరు చూపించారు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తారో ఆ వీడియోలో వివరించారు. సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘పుష్ప 2’ షూటింగ్ కు తీసుకెళ్లడంతో పాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్.. ఇలా ఈ వీడియోలో చూపించారు.
“పుష్ప 2″ సెట్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతారు” అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేసింది.

అంతే కాదు ఈ వీడియోలో బన్నీ చేసిన కామెంట్స్ ను కూడా క్యాప్షన్ రూపంలో చెప్పింది. “ఇండియాలో అభిమానులు చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం” అంటూ చెప్పడం అల్లు అర్జున్ గ్లోబల్ లెవెల్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారు అర్థమవుతుంది. “హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి. పుష్ప 2: ది రూల్ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది” అని ఫిల్మ్ సిటీ గురించి బన్నీ వివరించారు. అభిమానులే తనకు మోటివేషన్ అని, వాళ్ల ప్రేమే తాను తన సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular